@హైదరాబాద్ కేంద్రం నుండి
సర్ పై ఢిల్లీలో లోకసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ,ప్రియాంకా గాంధీ చేస్తున్న పోరాటం పై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఆయన నేడిక్కడ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఓటు చోరీ పై ఘాటుగా స్పందించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరుతో స్క్రోలింగ్ పాయింట్లు
“ఓటు చోరీ” ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బారికేడ్లతో ప్రజాస్వామ్యాన్ని బంధించలేరు: ఉత్తమ్
ప్రశ్నించే ఎంపీలను నిర్బంధించడం అధికార దర్పానికి నిదర్శనం: ఉత్తమ్
రాహుల్ పోరాటాన్ని కేసులతో అణచివేయాలనుకోవడం కేంద్ర ప్రభుత్వ భ్రమ: ఉత్తమ్
ఢిల్లీలో రాహుల్–ప్రియాంక, ప్రతిపక్ష ఎంపీల నిర్బంధాన్ని ఖండించిన మంత్రి ఉత్తమ్
జంతర్ మంతర్‌కు వెళ్తున్న ఎంపీల బస్సులను అడ్డుకోవడంపై ఉత్తమ్ ఆగ్రహం
కేసుల సంఖ్య పెంచితే ప్రజల ప్రశ్నలు తగ్గిపోతాయనుకోవడం పాలకుల పొరపాటు: ఉత్తమ్
రాహుల్ నాయకత్వం దేశవ్యాప్త ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి స్ఫూర్తి: ఉత్తమ్
ఓటు హక్కు కోసం నిలిచిన రాహుల్–ప్రియాంకల ధైర్యానికి అభినందనలు: ఉత్తమ్
ఓటర్ల జాబితాల సవరణపై అభ్యంతరాలకు ఎన్నికల సంఘం ఆధారాలతో జవాబివ్వాలి: ఉత్తమ్
ఆరోపణలను ఖండించడంతో సరిపెట్టకుండా ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి: ఉత్తమ్
ఓటర్ల పేర్ల చేర్పులు, తొలగింపులకు అనుసరించిన ప్రమాణాలను బహిర్గతం చేయాలి: ఉత్తమ్
“ఓటు చోరీ” ఆరోపణలపై స్వతంత్ర, నిష్పక్షపాత పరిశీలన జరగాలి: ఉత్తమ్
ఏ పార్టీ ఒత్తిడికీ లోనుకాకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయాలి: ఉత్తమ్
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న ప్రతిపక్ష డిమాండ్‌కు మద్దతు: ఉత్తమ్
ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలి.. ప్రతి అభ్యంతరానికి సమాధానమివ్వాలి: ఉత్తమ్
ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం మోపే వైఖరిని దేశం అంగీకరించదు: ఉత్తమ్
రాహుల్ నాయకత్వంలో ఎన్నికల పారదర్శకత పోరాటానికి సంపూర్ణ మద్దతు: ఉత్తమ్