*చీరకట్టులో పరుగులు పెట్టి.. హోంగార్డ్ ఉద్యోగం సాధించిన వితంతు మహిళ
సంకల్పం బలంగా ఉంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చని జార్ఖండ్‌కు చెందిన కవితా కుమారి మరోసారి నిరూపించారు.*కుటుంబ భారాన్ని మోస్తూ, కనీసం స్పోర్ట్స్ షూ లేదా ట్రాక్ సూట్ కూడా కొనుగోలు చేయలేని దుర్భర పేదరికంలో ఉన్న ఆమె..ఏకంగా చీరతోనే, చెప్పులు లేకుండా మండుటెండలో పరుగుపెట్టి అందరినీ ఆకట్టుకుodhi. రామ్‌గర్ జిల్లా దుల్మీ బ్లాక్ పరిధిలోని సోసో గ్రామానికి చెందిన కవితా కుమారి భర్తను కోల్పోయిన వితంతు మహిళ. ఇద్దరు పిల్లలు, అత్తమామలను పోషించే బాధ్యత ఆమెపై పడింది.కుటుంబ పోషణ కోసం హోంగార్డు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఆమె కఠిన శ్రమను ఎంచుకున్నారు.* ఆర్థిక స్థోమత లేకపోయినా ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి క్రమం తప్పకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేశారు.రామ్‌గర్‌లో జరిగిన హోంగార్డు నియామక ఫిజికల్ టెస్ట్‌కు ఆమె హాజరయ్యారు.*ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మహిళలు 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన 1,600 మీటర్ల పరుగు పందాన్ని,కవితా కుమారి కేవలం 6 నిమిషాల్లోనే విజయవంతంగా పూర్తి చేశారు. చీరకట్టుతో, ఒట్టికాళ్లతో ఆమె పరిగెత్తిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె పట్టుదలను ప్రశంసిస్తున్నారు.ఆమె అంకితభావాన్ని గుర్తించిన స్థానిక రన్నింగ్ అకాడమీ అధికారులు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి ఘనంగా సన్మానించారు.* మొత్తం 284 హోంగార్డు ఉద్యోగాలకు నిర్వహించిన ఈ నియామకాల్లో సగం స్థానాలను మహిళలకే కేటాయించారు.అందులోనూ వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలకు 5 శాతం కోటాను కేటాయించడం గమనార్హం. పట్టుదల ఉంటే పేదరికం ఏమాత్రం అడ్డంకి కాదని కవితా కుమారి తన విజయంతో సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తిని చాటారు.