అప్పట్లో ప్రైవేట్ భూములు.. ఇప్పుడు ప్రభుత్వం భూములంటూ కొర్రిలు..
*రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు*
*ప్రభుత్వ సర్వర్లో సాంకేతిక సమస్యలు
*22 A పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సబ్ రిజిస్టర్ అధికారులు*
*గతంలో సక్రమం అయిన వెంచర్లు ఇప్పుడు అక్రమం అంటూ ఇబ్బందులు
*అప్పుడు కానీ ప్రభుత్వ భూములు ఇప్పుడు ప్రభుత్వ భూములు గా ఎలా మారాయి అసల్ 22 A మర్మం ఏమిటి?*
తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతుగా ఉన్న సబ్ రిజిస్టర్ వ్యవస్థ రోజు రోజుకు ధీనావస్థకు చేరుకుంటుంది సర్వర్ అప్డేట్ పేరుతో వారానికోసారి సర్వర్ మొరాయిస్తూ రిజిస్ట్రేషన్ వ్యవహారం జరగకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈరోజు ఉదయం నుండి సర్వర్ రాకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు ప్రభుత్వ వ్యవహారం పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఉన్న సర్వర్ ను మొరాయించేలా చేయడం ప్రజలను ఇబ్బందికి గురి చేయడం తప్ప మరొకటి కాదని రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు గతంలో గ్రామ పంచాయతీ లెఔట్లు, డిటిసిపి హెచ్ఎండిఏ అప్రూవల్ లేఔట్, వెంచర్లు నిర్వహించి అందులోని ప్లాట్లను వెంచర్ నీర్వాహకులు అమ్మి వెళ్లిపోయారు కానీ అవే ప్లాట్లు మాత్రం ప్రస్తుతం ప్రజలు తమ అవసరాలకు అమ్మడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళగా రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్, షాద్ నగర్ సబ్ రిజిస్టర్ లు ఇవి 22ఏలో ఉన్నాయి అంటూ ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ లు చెయ్యవద్దని సర్కులర్ లు జారీ చేసిందని చెబుతున్నారు. ప్రభుత్వ భూములు అంటూ రక రకాల కారణాలతో చలానా చెల్లించి స్లాట్ బుక్ చేసి తీర రిజిస్ట్రేషన్ కి వెళ్ళాక రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారు అంటూ ప్రజలు అధికారుల తీరు మీద ఇటు ప్రభుత్వ తీరు మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి గతంలో ఈ వెంచర్లకు నాలా కన్వర్షన్ చేసింది రెవెన్యూ అధికారులు కాదా? అప్పుడు ప్రభుత్వ భూములు అని తెలియ లేదా భూదాన్ భూములు అని తెలియలేదా? అంటూ ప్రజలు మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. అప్పటి ప్రభుత్వ అధికారులే కదా తీరా అన్ని అయ్యాక రిజిస్ట్రేషన్ చేసింది కూడా గతంలో లేని ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు, ఇప్పుడు ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాయి. ఒకవేళ వాస్తవానికి ప్రభుత్వ భూమి అయి ఉంటే మరి రెవిన్యూ అధికారులు నాలా కన్వెన్షన్ ఏ విధంగా చేశారు, డీటీసీపీ హెచ్ఎండి అధికారులు వాటికి అనుమతి ఏ విధంగా ఇచ్చారు రిజిస్ట్రేషన్ లు ఏ విధంగా చేశారు అక్కడ వెంచర్ చేసి ప్లాట్ లు అమ్మి సొమ్ము చేసుకున్న వెంచర్ నిర్వాహకులు బాగానే ఉన్నారు ఇటు అనుమతులు ఇచ్చి ప్రజల దగ్గర డబ్బులు దండుకున్న ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి తీరా అమాయక ప్రజలు బలి పశువులు అవుతున్నారు
ఈ విషయం మీద విజేత జాబితా మీద ప్రజలు ప్రభుత్వ విహార వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫరూక్ నగర్ సబ్ రిజిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన నూతన సబ్ రిజిస్టర్ దీపక్ ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము 22 A లో ఉన్న వాటిని గాని, గ్రామ పంచాయతీ గృహాలు గానీ రిజిస్ట్రేషన్ లు చెయ్యం అని మరియు ప్లాటు ను రెండు భాగాలుగా చెయ్యకూడదని మాకు ప్రభుత్వం నుండి సర్కులర్ జారీ చేసిందని తెలిపారు. ఏది ఏమైనా ఎలాంటి మార్పులు చేర్పులు చేసిన ఎలాంటి చట్టాలు తెచ్చిన ప్రజల బాగు కోసం ఉండాలే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని ప్రజలు కోరుతున్నారు.