*CEC జ్ఞానేశ్ కుమార్‌కు బిగ్ షాక్*!
*తిరువనంతపురం: *ఎన్నికల నిర్వహణ వివాదాల నడుమ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎస్‌ఐఆర్‌తో పాటు ఎన్నికల నిర్వహణకు* *సంబంధించిన పలు కీలక వ్యవహారాల్లో ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో.. *ఈ పరిణామాలు* *రాజకీయంగా కలకలం రేపుతుండగానే*.. *సుమారు రెండు దశాబ్దాల క్రితం (2006లో) ఆయనపై నమోదైన ఓ ఆత్మహత్య కేసుకు సంబంధించి కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది* నాటి కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాలా విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు
*2006లో కేరళ రాష్ట్ర రవాణా ప్రాజెక్టులో భాగంగా ఎంసీ రోడ్డు ఆధునీకరణ పనుల కాంట్రాక్ట్‌ను మలేషియాకు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కంపెనీ 'పాటి', కేరళకు చెందిన భాగీరథి కన్ స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంయుక్తంగా 'పాటి-బెల్' పేరుతో చేపట్టాయి* *కేరళ కేఎస్‌పీటీ-1 ప్రాజెక్ట్‌కు చీఫ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న మలేషియాకు చెందిన సివిల్ ఇంజనీర్ లీసీ బీన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో పీడబ్ల్యూడీ కార్యదర్శిగా జ్ఞానేశ్ కుమార్ ఉన్నారు*
*జ్ఞానేశ్ కుమార్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు*
*ఇక ఆత్మహత్యకు ముందు లీసీ బీన్ రాసిన సూసైడ్ నోట్‌లో జ్ఞానేశ్ కుమార్* *పేరును ప్రస్తావించారు*. *ఆ ప్రాజెక్టు పనుల* *నిర్వహణలో తీవ్రమైన అవినీతి, తప్పుడు నిర్వహణ జరిగిందని, అలాగే పీడబ్ల్యూడీ అధికారుల నుండి తీవ్రమైన వేధింపులు* *ఎదురయ్యాయని ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల వెనుక అప్పటి పీడబ్ల్యూడీ సెక్రటరీగా ఉన్న జ్ఞానేశ్ కుమార్ పాత్ర ఉందనేది ప్రధాన ఆరోపణ* *అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారమే రేపింది*.
*విజిలెన్స్ విచారణకు*
*ఈ ఘటనపై ప్రాథమిక* *విచారణ జరిగినప్పటికీ*, *తదుపరి చర్యలు తీసుకోలేదని*.. *రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ కేసు దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి రాలేదనే బలమైన అనుమానాలు వ్యక్త మవుతున్నాయి* *ప్రస్తుతం రాజకీయ* *పరిణామాలు మారిన నేపథ్యంలో, ఆ నాటి సూసైడ్ నోట్‌లోని ఆరోపణలు, మరియు ప్రాథమిక దర్యాప్తులో జరిగిన లోపాలు, ఒత్తిళ్లపై సమగ్రమైన విజిలెన్స్ విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకొస్తాయని కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది*
*రెండు దశాబ్దాల నాటి ఈ కేసుకు సంబంధించి కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది*.