బెట్టింగులకు అలవాటుపడి అప్పులు చేసి, చేసిన అప్పులు తీర్చలేక సొంత మెనల్లుడే , మరో ఇద్దరితో కలిసి మేనమాను దారుణంగా హత్య చేసిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కోకాపేట లో గురువారం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మృతుడు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంకు చెందిన కంపాటి వెంకన్న గా గుర్తించారు. డబ్బులు ఇస్తాను అని నమ్మించి మామను కోకాపేట కు రప్పించిన అల్లుడు.. కారులోకి ఎక్కి మాటల్లో పెట్టి వెనుకనుంచి దడి చేసి కారులోనే క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపి కారులోనే మృత దేహాన్ని వదిలేసి పారిపోయారు. దర్యాప్తులో భాగంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఉస్మానియా క్యాంపస్ లో ఉంటూ పీహెచ్ డీ చేస్తున్న వెంకన్న. మృతుడికి భార్య , ఇద్దరు పిల్లలు వున్నారు