లంచం తీసుకుంటూ ఏసీబి కి పట్టుబడ్డ మహిళా అధికారులు
రూ . 2 లక్షలు తీసుకుంటూ రంగారెడ్డి డీఎంహెచ్ఓ స్వర్ణ కుమారి
రూ 4 లక్షలు లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారి తులసీరామ్ సునీత.
వేరు వేరు విభాగాలకు చెందిన ఇద్దరు మహిళా ఉన్నతాధికారులు ఒకేరోజు లంచం తీసుకుంటూ ఏసీబి కి పట్టుబడ్డ ఘటన హైదరాబాద్ లో సోమవారం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుపడ్డారు. ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఓ ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి ఆమె రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఈ మేరకు లంచం తీసుకుంటూ ఆమె రెడ్ హ్యాండెడ్ గ పట్టుపడ్డారు. రూ 2 లక్షలకు బేరం కుదుర్చుకున్న ఆమె రూ 1 లక్ష తీసుంటుండగా ఏసీబి అధికారులు దాడి చేశారు
మరో కేసులో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారి తులసీరామ్ సునీత రూ 4 లక్షలు తీసుకుంటూ ఏసీబి కి చిక్కారు. భవన నిర్మాణ నిభందనలు పాటించకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక బిల్డరుకు అనుకూలంగా వ్యవహరించడానికి లంచం రిమాండ్ చేశారు. ఏసీబి కి చిక్కిన క్రమంలో ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు.