మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. 28 ఏళ్ల బండేలా మనీషా హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన యువతిగా గుర్తింపు.. ఘటనా స్థలంలో తండ్రికి రాసిన లేఖ లభ్యం.. వ్యక్తిగత సమస్యలు, ఒంటరితనమే కారణమని సమాచారం. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఒస్మానియాకు తరలించారు.
క్రైమ్