15 ఏళ్ల బాలికపై ఏడాదిగా లైంగిక దాడి 

గర్భవతిని చేసిన కామాందుడు, అడ శిశువుకు జన్మనిచ్చిన బాలిక 

 

15 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి బెదిరించి ఓ కామాంధుడు ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడుతూ చివరికి గర్భవతి ని చేసిన ఘటన శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది గర్భం దాల్చిన బాలిక తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కుమ్మర్వాడీ ప్రాంతానికి చెందిన బాలిక (15)కు తల్లి చనిపోవడంతో తండ్రి వేరే వివాహం చేసుకొని వేరుగా ఉంటున్నాడు. దీంతో 15 ఏళ్ల బాలిక తన సోదరీతో కలిసి నానమ్మ ఇంట్లో నివాసం ఉంటుంది. బాలికపై కన్నేసిన అల్తాఫ్ ఆమెను బెదిరించి ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. ప్రస్తుతం బాలిక తొమ్మిది నెలల గర్భవతి అయ్యింది. శుక్రవారం విపరీతంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు గర్భంతో ఉందని తెలిపారు. అంతలోనే పురిటి నొప్పులు రావడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. స్థానికంగానే ఉన్న అల్తాఫ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటూ బాలిక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు.