పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్య యత్నానానికి పాల్పడిన ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది...పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ నగర్ కి చెందిన సురేందర్(40) కి కందికల్ గెట్ ప్రాంతంలో జి+1 బిల్డింగ్ అతని తల్లి పెరు పై ఉంది.ఆస్తి లో పంపకాలు చేయమని గత కొద్ది నెలలుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి తరచు గొడవ పడేవాడు.  అతన్ని కుటుంబ సభ్యులు మార్చి లో ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు దింతో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి సముదాయించి పంపించారు. అయినప్పటికీ అతను తన వైఖరి మార్చుకోకుండా మద్యనికి
 బానిసై తరచు ఇంటికి వచ్చి పంపకాలు జరపమని ఇబ్బందులకు గురి చేసేవాడు.ఇది ఇలా ఉండగా గురువారం తన సోదరికి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎదో ఒకటి తెలుస్తానని శపథం చేసి వచ్చి మళ్ళీ పంపకాల విషయం పై గొడవ పడి ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఛత్రినాక పోలీస్ స్టేషన్ ఎదుటకి  వచ్చి నిప్పంటించుకున్నాడు.ఇది గమనించిన పోలీసులు, స్థానికులు మంటలు ఆర్పీ చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సురేందర్ 38 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు.