దూల్పేట ను జల్లెడ పట్టిన ఎక్సైజ్ టీములు..
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఏడుగురి అరెస్ట్..
దూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో 2026వ సంవత్సరంలో కేసుల్లో నేరాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న గంజాయి నిందితులను పట్టుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఏ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు దూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్ టీమ్ సీఐ ప్రవీణ్ కుమార్ టీం తో పాటు హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీం, డిటిఎఫ్ హైదరాబాద్ టీం, శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ టీం, చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్ లకు చెందిన ఎక్సైజ్ టీం లతోపాటు 30 మంది సిబ్బంది కలిసి ముమ్మరంగా వివిధ కేసుల్లో నిధుల నిందితుల కోసం దూల్పేట్ ను జల్లెడ పట్టారు.
ప్రధానంగా టీములు దూల్పేట్ ఎక్సైజ్ పరిధిలోని మంగు బస్తి, బలరాం గల్లి, గంగాబౌలి, మంగల్ హార్ట్, లోయర్ దూల్పేట్, జుమ్మేరాత్ బజార్ ప్రాంతాల్లో ఎక్సైజ్ టీములు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
ఈ తనిఖీల్లో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ కాబడిన వారిలో జయబాయి, శివ వాణి సింగ్, స్నేహ సింగ్, సుమన్ భాయ్, నయనా, దేవేందర్ సింగ్, దుర్గేసులను అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఈ స్పెషల్ డ్రై దాడుల్లో ఎక్సైజ్ సీఐ లు ప్రవీణ్ కుమార్, విప్లవ రెడ్డి, వెంకన్న, భరత్ భూషణ్, నజీర్ పాషా, నరేందర్ రెడ్డి, ఎస్ఐలు వెంకటేశ్వర్ రెడ్డి, మొగులప్ప, చాందిని సిబ్బంది కలిసి దాడులకు నేతృత్వం వహించారు.
స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి ఏడుగురు వ్యక్తులను నిందితులను అరెస్ట్ చేసినందుకు అసిస్టెంట్ కమిషనర్ డి శ్రీనివాస్,ఎక్సైజ్ సూపర్డెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ అభినందించారు.