చెప్పుల విషయంలో భార్యతో గొడవ పడి 47 ఏళ్ల ప్రభుత్వ వైద్యుడు లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీ లోని కాన్పూర్ లో మంగళవారం చోటుచేసుకుంది.

🔹 యూపీలోని కాన్పూర్‌లో జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుడు సందీప్ సింగ్ (47)కు భార్యతో చెప్పుల విషయంలో వివాదం జరిగింది. తెల్లవారుజామున 2 గంటలకు లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కాల్చుకుని మృతి చెందారు.

🔹 మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సందీప్.. 2019లో కాస్గంజ్‌కు చెందిన కంచన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె, రెండు నెలల కుమారుడు ఉన్నారు