డీఏల ఆమోదం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు
మిగతా పెండింగ్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలి
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ పేర్కొన్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో రెండు డీఏలను ఇప్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ సంజయ్‌జాజు హామీ ఇచ్చారన్నారు. రెండు డీఏలపై రాష్ట్ర క్యాబినేట్ ఆమోదించడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు పీఆర్‌సీ విషయంలోనూ ప్రభుత్వం వెంటనే నివేదికను తెప్పించుకొని అమలు చేయాలని కోరారు. ఇవే కాకుండా సీపీఎస్ విషయంపై కూడా ఆలోచన చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను కూడా క్లియర్ చేసేలా చూడాలని కోరారు.