"దసరా ( విజయదశమి) కి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం"

దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది.
 ఈ పండుగకు 7వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది.
 ఇందులో భాగంగా కరీంనగర్ జోన్ నుంచి మొత్తం 3533 బస్సులు నడుపుతోంది... రీజియన్ల వారిగా ఆదిలాబాద్ 431, నిజామాబాద్ 719, కరీంనగర్ 1175, వరంగల్ 530, ఖమ్మం 678,
హైదరాబాద్ జోన్ నుంచి 2155 బస్సులు నడుపుతుండగా రీజియన్ల వారిగా మహబూబ్ నగర్ 645, మెదక్ 255 , నల్గొండ 815, రంగారెడ్డి 440.
అలాగే గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1312 దసరా పండగ కు ప్రత్యేక సర్వీసు లను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.

ప్రధానంగా ఈ నెల 9,10,16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 25, 26 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది.