పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం.. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21 వ తేదీ పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లాలోని ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, షార్ట్ ఫిల్మ్‌లు తీసేవారి కోసం ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు తెలిపారు.
ఈ పోటీల్లో పోలీసుల విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించిన అంశాలపై 2025 అక్టోబర్ నెల నుంచి 2026 అక్టోబర్ నెల వరకు తీసిన 3 ఫోటోలు, అలాగే 3 నిమిషాల నిడివి మించని షార్ట్ ఫిల్మ్‌లను ఈ నెల 25వ తేదీలోపు పోటీలకు పంపించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో అందిన ఎంట్రీల నుంచి ఉత్తమ మూడు షార్ట్ ఫిల్మ్‌లు, మూడు ఫోటోలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన వారికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని సూర్యాపేట జిల్లాలోని ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, షార్ట్ ఫిల్మ్‌లు తీసేవారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, పోలీసుల సేవలు, విధి నిర్వహణ వంటి అంశాలను ప్రతిబింబించే మంచి ఫోటోలు, షార్ట్ ఫిల్మ్‌లను పోటీలకు పంపించాలన్నారు.
షార్ట్ ఫిల్మ్‌ను పెన్ డ్రైవ్‌లో, 10 × 8 అంగుళాల పరిమాణంలో 3 ఫోటోలను హార్డ్ కాపీలతో పాటు సాఫ్ట్ కాపీ రూపంలో పెన్ డ్రైవ్‌లో పొందుపరిచి, ఈ నెల 22వ తేదీలోపు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ పి.ఆర్.ఓ. కు అందజేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.
మరిన్ని వివరాల కోసం పి.ఆర్.ఓ. నంబర్: 8712686059 ను సంప్రదించవచ్చు.