శ్రీయుత గౌరవనీయులైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి

*విషయం: పోలీసు సిబ్బందికి రావలసిన సరెండర్ లీవ్, TAలు మరియు GPF Part-Final బకాయిలను వెంటనే మంజూరు చేసి విడుదల చేయించవలసిందిగా వినతి.*

ఆర్య

మేము సిద్దిపేట జిల్లా పోలీసు సిబ్బందిమి. నేను *డాక్టర్ చిందం సుభాష్, సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడిగా*, మా పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబాల తరఫున ఈ వినతిపత్రాన్ని సమర్పిస్తున్నాను. సార్ జిల్లా పోలీసులకు చాలా రోజులుగా సరెండర్ లీవ్ బకాయిలు, టి ఏ బిల్లులు , మరియు జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ డబ్బులు మంజూరు కాకపోవడంతో సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, మరియు ప్రస్తుతం *దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో*, కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, వైద్య ఖర్చులు మరియు ఇతర అత్యవసర అవసరాల కోసం సిబ్బంది తమకు రావలసిన ఈ మొత్తాలపై ఆధారపడుతున్నారు. అయితే బకాయిలు విడుదల కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కావున గౌరవ మంత్రివర్యులు గారు చొరవ తీసుకొని పోలీస్ సిబ్బందికి రావలసిన సరెండర్ లీవ్ బకాయిలు, TAలు మరియు GPF Part-Final మొత్తాలను వెంటనే మంజూరు చేసి, విడుదల చేయించేందుకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా* మా తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.

ఇట్లు

తమ విధేయులు

డాక్టర్ చిందం సుభాష్

సిద్దిపేట జిల్లా పోలీస్ ప్రెసిడెంట్ మరియు పాలకవర్గం