రైతును అవమానించిన MRO సస్పెండ్ 

అహంభావం.. నోటి దురుసుతో రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో కు తగిన శాస్తి జరిగింది..!

విధులనుండి సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి ఆదేశాలు జారీ చేశారు.

రైతును ఉద్దేశించి ఎమ్మార్వో చిట్టంపల్లి స్వామి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపింది..!

దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వాస్తవమేంటో విచారించాల్సిందిగా కలెక్టర్ కు సూచించిన నేపథ్యంలో.. విచారణ జరిపిన కలెక్టర్.. ఎమ్మార్వో తప్పు చేసినట్లుగా.. రైతును అవమానించినట్లుగా నిర్ధారించుకుని ఉన్నతాధికారులకు నివేదించడంతో... వారి సూచన మేరకు ఎమ్మార్వోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు..!

 

.....