నేడు అక్టోబర్ -న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూర్ లక్ష్మణ్ లు మునగాల మండలం ఎస్.ఎం పేటలో మంగళవారం పర్యటిస్తారు రూ 9.6 కోట్ల అంచనా వ్యయంతో హరే కృష్ణ మిషన్ ఆధునిక కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి మెగా కమ్యూనిటీ కిచెన్ ని శంకుస్థాపన చేస్తారు. దాని వల్ల జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో చదువుతున్న 60వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది... ఆరు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు.

అనంతరం .. పులిచింతల ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రులు..

టీజీ జెన్కో జల విద్యుత్ ప్రాజెక్టు సందర్శించి జెన్కో నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్య సమావేశం నిర్వహిస్తారు. ఆ తరువాత గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలించనున్నారు.