నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మోసం దగా చేస్తున్నాయి- టిఆర్ ఎస్ (తెలంగాణ రక్షణ సేన ) అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు..
🔹వాళ్ల దుఃఖాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్లు బాధితులు అనడానికి ఆధారాలే లేవని అంటున్నాడు🔹ఇందుకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి🔹సిరిసిల్ల సభలో బాధితులకు రూ.10, రూ.5 లక్షల చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు🔹 బీఆర్ఎస్ పాలనలో వారిని హింసిస్తే కాంగ్రెస్ హయాంలోనూ అన్యాయమే జరుగుతోంది.🔹 ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు, మూడు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినప్పుడే వారికి కాస్తానై న్యాయం జరిగినట్లు .తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు.🔹నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దగా చేస్తున్నాయి.🔹నేరెళ్ల బాధితులు అసలు బాధితులు అనడానికి ఆధారాలే లేవట.. ఇందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి.🔹నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు గత ప్రభుత్వంలోని కొందరు సాగించిన దాస్థీకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరిపేసిందా?🔹నేరెళ్ల బాధితులపైనే ఉల్టా పెట్టిన కేసులు ఉన్నాయి కానీ వారు బాధితులు అని చెప్పే ఆధారాలు ఎలా మాయం అయ్యాయి.🔹సీఎం సిరిసిల్ల పర్యటనతో నేరెళ్లలో బాధితులకు ఏమాత్రం న్యాయం చేయలేదు.🔹సిరిసిల్ల నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్ట్ ల గురించి అస్సలు మాట్లాడలేదు. 🔹అక్కడి నేతన్నలకు బలమైన హామీలు ఇవ్వలేదు. పద్మశాలీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీని చేస్తామని చెప్పారు తప్ప అది కూడా నెరవేరుతుందో లేదో ఎవరికీ తెలియదు.🔹కేసీఆర్ ప్రభుత్వంలో నేరెళ్ల బాధితుల అంశాన్ని రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించి అధికారంలోకి వచ్చారు.🔹2017 జులైలో నేరెళ్లలో జరిగిన సంఘటన మనం తలదించుకునే ఘటన.. దాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు.🔹ఆ ఘటనలో 8 కుటుంబాలు బాధితులుగా ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డాయి.🔹వారికి న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తే కొంతమందికి ఐదు లక్షలు, కొంతమందికి 10 లక్షల చెక్కులను ముఖ్యమంత్రి ఇచ్చారు.🔹ఇన్ని రోజులు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఇబ్బంది పడిన వాళ్లకు 5, 10 లక్షలు సరిపోతాయా? వాటితో వాళ్లు జీవితంలో సెటిల్ అవుతారా?.🔹కచ్చితంగా బాధిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందే.🔹బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మీ నోటితోనే హామీ ఇచ్చారు. వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.🔹సిరిసిల్లలో అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు వాళ్లను టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్లు కొడితే వారికి ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు .🔹నేరెళ్ల సంఘటనకు సంబంధించి కీలకమైన రిపోర్టులు లేవని చెబుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 🔹జైలర్ రాసిన రిపోర్టులు, అప్పటి డీఐజీ రవివర్మ బాధితులతో మాట్లాడిన రిపోర్టులు అన్ని మాయమయ్యాయంట. 🔹అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామన్న హామీ కూడా ఒకటి
🔹కానీ మూడేళ్లలో ఈ ప్రభుత్వం ఆ సంఘటనకు సంబంధించిన రిపోర్టులనే చూడలేదు.🔹ముఖ్యమంత్రి పర్యటనకు ముందు రిపోర్టులు చూసి.. ఇప్పుడు మీకు న్యాయం చేయలేమని చెబుతున్నారు.🔹అసలు నేషనల్ ఎస్సీ కమిషన్ ప్రజా కోర్టు, ఓపెన్ హియరింగ్ చేపట్టిన రిపోర్ట్ ఏదీ? దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి పెంచటం లేదు. 🔹నేషనల్ ఎస్సీ కమిషన్ ప్రజా కోర్టు నిర్వహించిన రిపోర్టులు ఏమయ్యాయి?. 🔹పైగా బాధితులపైనే ఆనాడు అక్రమంగా కేసులు పెట్టారు. 🔹ఇప్పటికీ కూడా వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక వారికి ఓపిక లేదు 🔹వెంటనే వారిపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. 🔹ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసాలతో వారికి న్యాయం జరగదు.🔹నేషనల్ ఎస్సీ కమిషన్ ను ఎన్నిసార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదు. దానికి వెనుక ఏ శక్తి ఉందో తెలియడం లేదు.🔹నేరెళ్ల బాధితులకు న్యాయం కోసం మేము ప్రభుత్వానికి లేఖ కూడా రాస్తాం . 🔹నేరెళ్ల బాధితులకు బీఆర్ఎస్ హయాంలోనూ, కాంగ్రెస్ పాలనలోనూ అన్యాయమే జరుగుతోంది .🔹ఆనాటి రిపోర్టులు బీఆర్ఎస్ హయాంలోనే మాయమై ఉంటే బాధ్యులైన అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలి . 🔹ప్రతి అంశంలో ఈ ప్రభుత్వం వైఖరి అనుమానాస్పదంగానే ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంటూనే ఆధారాలు ధ్వంసం చేశారని చెబుతున్నారు.🔹అసలు నేరెళ్ల బాధితులను బాధితులు అనటానికే ఆధారాలు లేవని చెబుతున్నారంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి .🔹నేరెళ్ల బాధితుల దుఖాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వారిని మోసం చేస్తున్నారు. 🔹దీనికి కచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన శాస్తి జరగుతుంది.