సెలవు రోజుల్లో 41 బార్లకు దరఖాస్తుల స్వీకరణ..
రెండు సెలవు రోజుల్లో 41 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎక్సైజ్‌శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
రెండు రోజుల సెలవుల్లో కూడ దరఖాస్తులు తీసుకోవాలని దరఖాస్తుదారుల నుంచి విజ్ఞప్తులు రావడం, రెండు రోజుల సెలవు రోజుల్లో దరఖాస్తులు తీసుకుంటే బాగుంటుందని డిప్యూటి కమిషనర్ల నుంచి కూడ రిక్వెస్ట్‌లు రావడంతో శని, ఆదివారాల్లో దరఖాస్తులు తీసుకోవడానికి ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ తెలిపారు.
ఈ నెల 10న రెండో శనివారం, 11న ఆదివారం రోజున ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బార్లకు దరఖాస్తులు తీసుకుంటారని కమిషనర్ తెలిపారు.