*రూ.20 లక్షల లంచం.. తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, మండల సర్వేయర్*

* అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు ఏసీబీ వలకు చిక్కారు.

* హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం భూమి సర్వే చేసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు ఇచ్చేందుకు లంచం డిమాండ్.

* తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేసి, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం.

* ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుండగా సర్వేయర్‌ను పట్టుకున్న ఏసీబీ.

* సర్వేయర్ వద్ద లంచం సొమ్ము స్వాధీనం.

* రసాయన పరీక్షలో సర్వేయర్ చేతివేళ్లకు పాజిటివ్ ఫలితం.

* తహసీల్దార్ ఆదేశాల మేరకు లంచం తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది.

 ఇద్దరు అధికారులను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించింది.