బిల్డర్ నిర్లక్ష్యం... పిల్లలకు ప్రమాదం..!

నిర్మాణంలో ఉన్న కట్టడం నుండి ఐరన్ రాడ్డు ఊడిపడి స్కూల్ లో ఓ విద్యార్థి తలకు గాయాలయ్యాయి. ఈ పాత బస్తిలోని బార్కస్. లోని ప్రభుత్వ స్కూల్ మొదటి రెండో అంతస్తులో కొత్తగా నిర్మాణం చేపట్టారు... క్రింద ఫస్ట్ ఫ్లోర్.. గ్రౌండ్ ఫ్లోర్ లో స్కూల్ కొనసాగుతోంది.. అయితే బిల్డర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు..

కింద ఫ్లోర్ లలో పిల్లలు తరగతులకు హాజరవుతున్న విషయం తెలిసి కూడా ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాడు..!

ఈ క్రమంలో గురువారం స్కూల్ లో తరగతులు కొనసాగుతున్న సమయంలో నిర్మాణ స్థలం నుండి ఓ ఐరన్ రాడ్ ఊడి నేరుగా కింద ఉన్న విద్యార్థిని తలపై నేరుగా పడింది..! రెండంతస్తుల పై నుండి రాడ్ పడడంతో బలంగా తలపై గాయమైంది..!

పిల్లలు ఉన్నారని తెలిసినప్పటికీ పూర్తి నిర్లక్ష్యంగా.. రక్షణ ఏర్పాట్లు లేకుండా నిర్మాణ పనులు చేయిస్తున్న బిల్డర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గాయపడిన విదార్థిని తల్లిదండ్రులు.. స్కూల్ నిర్వాహకులు..!......

 

.......