1.6 గ్రాముల ఎండిఎంఎ పట్టివేత..

మాదాపూర్ సాయినగర్ ప్రాంతంలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఏ టీమ్ సీఐ నాగరాజు సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిఖిల్ శర్మ (32) అనే వ్యక్తి వద్ద 1.6 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని డ్రగ్స్ ను మాదాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

.....,..,..................

15.49 గ్రాముల హెరాయిన్ పట్టివేత..

గండిపేట్ నర్సింగ్ ప్రాంతంలో డ్రగ్స్ అమ్మకాలు జరుపు తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బీటీం సీఐ గణపతిరెడ్డి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో వెస్టు బెంగాల్‌కు చెందిన లేబర్ సుజిత్ (32) అనే వ్యక్తి వద్ద 15.49 హెరాయిన్ పట్టుబడింది. నిందితుడికి ఎండీ అనురుల్ అనే వ్యక్తి సరఫరా చేశాడనే సమాచారం మేరకు ఆతడిపై కూడ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని, హెరాయిన్‌ను గండిపేట్ ఎక్సైజ్ స్టేషన్ల లో అప్పగించారు.