ప్రేమ పేరుతో మైనర్ బాలికను పెళ్లి చేసుకొని లైంగికంగా శారీరకంగా కలిసిన వ్యక్తిపై నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. వివరాల్లోకి వెళితే కర్నూలు కి చెందిన గువ్వల ఉపేంద్ర, వయసు 20 సంవత్సరాలు అను వ్యక్తి సుమారు నాలుగు నెలల క్రితం మైనర్ బాలికతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం తనను ప్రేమిస్తున్నట్లు చెప్పి తేదీ 24 11 2026 నాడు నేరేడ్మెట్ లోని ఒక గుడిలో అట్టి మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బాలిక ఇంట్లోనే ఆమెను శారీరకంగా అనుభవించినాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉపేంద్ర పై నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మరియు ఎస్సీ ఎస్టీ ఆక్ట్ ల కింద కేసు నమోదు చేయబడి దర్యాప్తు జరుగుచున్నది