భర్త మీద కోపం , కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం సోమన్‌గుర్తిలో వెలుగులోకి వచ్చింది. మాటుగూడెం గ్రామానికి చెందిన ఉప్పరి రాజు, మమత అలియాస్‌ పద్మమ్మ భార్య భర్తలు. వారికీ ఇద్దరు పిల్లలు సాకెత్‌ (8), జనశ్రీ (4). కొంతకాలంగా ఇంట్లో భార్య భర్తలకు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తన ఇద్దరు పిల్లలతో ఇంట్లోంచి వెళ్లిన మమత సోమన్‌గుర్తి సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకింది. బావి గట్టుపై చెప్పులు, హ్యాండ్‌ బ్యాగ్‌ను గమనించిన స్థానికులు మృతదేహలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చెన్‌గోముల్‌ పోలీసులు శనివారం మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.