హైదరాబాద్ లో దీపావళి పండుగ రోజు మొత్తం నాలుగు అగ్ని ప్రమాదాలు సంబవించడం తీవ్ర కలకలం రేపింది.. సికింద్రాబాద్, కూకట్పల్లి అస్బెష్టాస్ కాలనీల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. 

.. కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మూడు పరిశ్రమలు పూర్తిగా దగ్ధం

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ యూనిట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న GRT నెయ్యి, హల్దీరామ్స్ గోదాములకు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో కనీసం మూడు కంపెనీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఐదు ఆటోలు, ఒక డీసీఎం వాహనం మంటల్లో కాలిపోయాయి.

 షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫైర్ సిబ్బంది, హైడ్రా బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.