కరీంనగర్‌లో తన భర్తతో కలిసి నివసిస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన యువతి.. తన 0వ తరగతి బ్యాచిమేట్ తో తరచూ ఫోన్‌లో మాట్లాడేది. అతను హైదరాబాద్ 8వ బెటాలియన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది మార్చి 3న తనపై 10వ తరగతి బ్యాచిమేట్ లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడి వీడియోలను రహస్యంగా చిత్రీకరించి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో పాటు, ఆమె నుంచి రూ.1.3 లక్షలు వసూలు చేసినట్టు యువతి ఫిర్యాదు లో పేర్కొంది. డబ్బులు ఇచ్చాక కూడా వేధింపులు ఆపకుండా తన ఇంటికి వచ్చి వీడియోలు భర్తకు చూపించాడని, దీంతో తనను ఇంటి నుంచి పంపించేశారని, ఆ గొడవల వల్ల గర్భం కోల్పోయానని ఫిర్యాదులో పేర్కొన్న యువతి. దీంతో కానిస్టేబుల్ పై కరీంనగర్ రూరల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.