ప్రభుత్వ ఆసుపత్రిలో తుప్పు పట్టిన స్ట్రేచర్స్

బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తరలిస్తుండగా విరిగిపోయిన స్ట్రెచర్

వికారాబాద్ బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో నిర్లక్ష్యం

 

వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన, తుప్పు పట్టిన స్ట్రెచర్‌లతో రోగులు రుబ్బందులు పడుతున్నారు. శుక్రవారం వికారాబాద్ లో జరిగిన బస్సు ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రిలో తరలిస్తుండగా స్ట్రెచర్‌పై నుంచి కిందపడిన క్షతగాత్రులు. వీల్‌చైర్లు లేకపోవడంతో తీవ్ర గాయాలతో నడుచుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లిన క్షతగాత్రులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది