ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని దోనా పౌలా ప్రాంతంలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. ఆయన శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలిపారు నానా పటేకర్ మృతితో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది