*ప్ర‌భుత్వం దృష్టికి రెవెన్యూ ఉద్యోగుల స‌మ‌స్య‌లు..!*

*టీజీఆర్ఎస్ఏ అధ్య‌క్షులు బాణాల రాంరెడ్డి*

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రెవెన్యూ ఉద్యోగుల‌కు సంబంధించిన అనేక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్న‌ట్టుగా టీజీఆర్ఎస్ఏ అధ్య‌క్షులు బాణాల రాంరెడ్డి పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ ఇంకా కూడా కొన్ని స‌మ‌స్య‌లు మిగిలే ఉన్నాయ‌న్నారు. అన్ని ర‌కాల స‌మ‌స్య‌ల‌ను అతి త్వ‌ర‌లోనే సీఎం రేవంత్‌రెడ్డి గారి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి గార్ల దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారం అయ్యేలా చూడ‌నున్న‌ట్టుగా తెలిపారు. 

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని రెవెన్యూ భవన్ లో టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బాణాల రాంరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు లచ్చిరెడ్డి గారు, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక గారు, ప్రధాన కార్యదర్శి బిక్షం గారు, కోశాధికారి మల్లేష్ గారు, CCLA యూనిట్ అధ్యక్షులు రాంబాబు గారు, కార్యదర్శి చైతన్య గారు, అసోసియేట్ అధ్యక్షులు సుధాకర్ రావు, చంద్ర శేఖర్ మోర గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శులు,ఆర్గనైసింగ్ సెక్రెటరీస్, వివిధ జిల్లాల అధ్యక్షకార్యదర్శులు పాల్గొన్నారు.

గత రెండు సంవత్సరాలుగా అసోసియేషన్ ఎన్నో విజ‌యాల‌ను సాధించింద‌ని ఈ సంద‌ర్భంగా వి.ల‌చ్చిరెడ్డి గారు, బాణాల రాంరెడ్డి పేర్కొన్నారు. గ‌త ప‌దేళ్ల‌ల్లో ఎవ‌రూ సాధించ‌లేని విజయాల‌ను టీజీఆర్ఎస్ఏ సాధించింద‌న్నారు. దీంతోనే రాష్ట్రంలో రెవెన్యూ శాఖ‌కు పూర్వ‌వైభ‌వం వ‌చ్చింద‌న్నారు. అన‌తి కాలంలోనే అసోసియేష‌న్ సాధించిన విజ‌యాలే నేడు రెవెన్యూ ఉద్యోగుల‌కు వ‌రంగా మారాయ‌న్నారు. అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో రాబోయే కాలంలో చేపట్టవలసిన కార్యక్రమాల పట్ల రాష్ట్ర అధ్యక్షులు బాణాల రాంరెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు లచ్చిరెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప‌లు తీర్మానాల‌ను చేయ‌డం జ‌రిగింది. 

*సమావేశం చేసిన‌ తీర్మానాలు* 

1) రికార్డు అసిస్టెంట్ నుండి డిప్యూటీ తహసీల్దార్ వరకు అన్ని క్యాడర్ ల ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం కల్పించాలి.

 2) రెవెన్యూ ఇన్స్పెక్టర్ లకు FTA మంజూరు చేయాలి.

3) ప్రతి మండలానికి ప్రోటోకాల్ బడ్జెట్ కేటాయించాలి.

4) తహసీల్దార్ కార్యాలయాలలో మహిళా ఉద్యోగులకు సరైన టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి 

5) శిధిలావస్తలో ఉన్న రెవెన్యూ కార్యాలయాల స్థానం లో నూతన కార్యాలయాలు నిర్మించాలి 

6) 61+ VRA వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.

7) ధరణి ఆపరేటర్లు,TCO వాల్ల సేవలు కొనసాగించాలి.

8) సొంత నియోజక వర్గం నిబంధన నుండి GPO లను మినహాయించాలి.

9) VRA నుండి జూనియర్ అసిస్టెంట్ గా వచ్చిన వారికి CPT టెస్ట్ నుండి మినహాయించాలి.

10) వార్డ్ ఆఫీసర్ నుండి GPO గా వచ్చిన వారికి మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి.