42 బార్లకు.. 8770 దరఖాస్తులు.. 

 శుక్రవారం *బార్ల లక్కి డ్రాకు ఏర్పాట్లు పూర్తి*  చేసిన excise శాఖ... 

టీసీయుఆర్ (తెలంగాణ క్యూర్ అర్బన్ రీజియన్) పరిధి లోని 14 బార్లకు, మిగిలిన కార్పొరేషన్ మునిసిపాలిటీల్లో 27 బార్లకు వచ్చిన దరఖాస్తుల్లో శుక్రవారం జరిగే లక్కి డ్రా ద్వారా బార్ లైసెన్సీలను ఎంపిక కోసం ఎక్సైజ్‌శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు..!

టీసీయుఆర్ పరిధిలోని 14 బార్లకు 4251 దరఖాస్తులు వచ్చాయి. కార్పొరేషన్ మునిసిపాలిటీల్లోని 27బార్లకు 4519 దరఖాస్తులు వచ్చాయి..!

టీసీయుఆర్‌తో పాటు అన్ని జిల్లాలో ఈ నెల 16 శుక్రవారం ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ద్వారా బార్ లైసెన్సీలను ఎంపిక చేస్తారని ఎక్సైజ్ శాఖ పేర్కొంది..!

టీసీయుఆర్ పరిధిలోని 14 బార్లకు సంబంధించిన లక్కి డ్రాను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ తీస్తారు..!

మిగిలిన జిల్లాలో ఆయా జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా లక్కి డ్రాలో బార్ లైసెన్సీలను ఎంపిక చేస్తారు.!

టీసీయుఆర్‌లోని 14 బార్లకు సైబరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి డిప్యూటి కమిషనర్లు పర్యవేక్షిస్తారు..!

14 బార్ల కోసం డిప్యూటి కమిషనర్ల పరిధిలోని దరఖాస్తుదారులు ది అడ్రస్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ నార్సింగ్ గండిపేట మండలం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ డిప్యూటి కమిషనర్ జె.హరికిషన్ తెలిపారు..!

దరఖాస్తుదారులకు ఇప్పటికే వాట్సాప్ ద్వారా..ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని చేర వేశామని అందరు ఉదయం తొమ్మిది గంటల వరకు హజరు కావాలని డిప్యూటి కమిషనర్లు కోరారు.